రాజీనామా చేసిన సిద్దిపేట కలెక్టర్ !
సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఐఏఎస్ పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర సీఎస్ సోమేశ్ కుమార్ను సోమవారం కలిసిన కలెక్టర్ వెంకట్రామిరెడ్డి తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. కలెక్టర్ రాజీనామాను సీఎస్ వెంటనే ఆమోదం తెలిపారు. అనంతరం వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. త్వరలో టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. 26 సంవత్సారాలు అన్ని ప్రభుత్వాల్లో పని చేశానని వెల్లడించిన ఆయన పార్టీలో ఎప్పుడు చేరాలనే ఆదేశాలు ఇంకా రాలేదన్నారు.కాగా ఎమ్మెల్సీ అభ్యర్థుల పోటీలో కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పేరు వినిపిస్తోంది. కేసీఆర్కు అత్యంత విధేయుడైన వెంకట్రామిరెడ్డికి ఎమ్మెల్యే లేదా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కలెక్టర్ పదవికి వెంకట్రామిరెడ్డి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ రేపటితో ముగియనుండటంతో.. అభ్యర్థుల ఎంపిక కోసం టీఆర్ఎస్ తీవ్ర కసరత్తు చేస్తోంది