కార్మికుల రక్షణే వారి విది!
ఆర్జీ1 టిబిజికెఎస్ ఎస్&పిసి ఫిట్ సెక్రెటరీ రొడ్డ సంపత్, సెక్యూరిటీ సిబ్బంది ఆధ్వర్యంలో బుధవారం జిఎం ఆఫీస్ ముందు ఎస్&పిసి హాలు లొ రెష్క్యూ సోల్జర్స్ ను సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీబీజీకేఎస్ నాయకులు డిప్యూటీ జనరల్ సెక్రటరీ కనకం శాంషన్, సెంట్రల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వడ్డె పెళ్లి శంకర్, సినియర్ ఇన్స్పెక్టర్ రామ్ రెడ్డి విచ్చేసి గత నెలలోఎఎల్పి ప్రమాదంలో రెస్క్యూ టీం లో రిస్కు తీసుకొని కష్టపడి పనిచేసి కార్మికుల ప్రాణాలు కాపాడిన మా తోటి సెక్యూరిటీ సోదరులు ఎండి అస్లాం, ఆకుల కృష్ణమూర్తి, ఎన్ మధుసూదన్, సిద్ది సదయ్య లను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ పిట్ సెక్రెటరీ కెఆర్ సదానందం, గొల్ల కర్ణాకర్, పాలితం శ్రీనివాస్, మిట్టపల్లి కుమారస్వామి, ఎస్సి,ఎస్టి ఆర్గనైజింగ్ సెక్రటరీ లింగమూర్తి, సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు.