సింగరేణి ఆర్డీ-1 జీఎంపై కేసు..

సింగరేణి ఆర్-1 జనరల్ మేనేజర్ కల్వల నారాయణ, మాజీ అధికార ప్రతినిధి ఎస్. రమేష్ లపై కోర్టు ఆదేశాల మేరకు గోదావరిఖని వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. గత ఏడాది మార్చి 1వ తే దిన జీఎం కాలనీలో తాను భవనం నిర్మిస్తున్నానని, దాన్ని కూల్చివేసినట్టు జీఎం, అధికార ప్రతినిధులు ప్రకటించార న్నారు. తనకు సంబంధం లేని విషయంలో తన పేరును చేర్చి ప్రకటన చేయడం ద్వారా తన ప్రతిష్టకు భంగం కలి గినట్టు కాంగ్రెస్ కార్పొరేటర్ మహంకాళి స్వామి గోదావరి ఖని జూనియర్ సివిల్ జడ్జి కోర్టును మొదటి అదనపు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు జీఎంతో పాటు అధికార ప్రతినిధి రమేష్ పై కేసు నమోదు చేయాలని ఆదేశించింది… కోర్టు ఆదేశానుసారం గత నెల 28న ఐపీసీ 500 సీఆర్పీసీ 156(3) కింద కేసు నమోదు చేసినట్టు వనౌన్ పోలీసులు తెలిపారు……

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *