కార్మికులకు మెరుగైన వేతన ఒప్పందం……
దర్వాజ: బొగ్గు గని కార్మికులకు మెరుగైన వేతన ఒప్పందం జరిగిందని, ఇది చారిత్రాత్మకమని జేబీసీసీఐ మెంబర్ కొత్తకాపు లక్ష్మారెడ్డిపేర్కొన్నారు. శనివారం గోదావరిఖని జవహర్ నగర్ లోని శిశుమందిర్‌లో జరిగినవిలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 19శాతం ఫిట్మెంట్తో బొగ్గుగని కార్మికులకు మెరుగైన వేతన ఒప్పందం జరిగిందన్నారు. అలవెన్సులు, ఇతర బెనిఫిట్స్ పై మే రెండవ వారంలో జరుగనున్న సమావేశంలో చర్చిస్తామన్నారు. డీజీఎంఎస్ సరైన రక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్లనే తరచూ ప్రమాదం జరుగుతున్నాయని, డీజీఎంఎస్ వైఫల్యాన్ని నిరసిస్తూ మే 22న ధన్బాద్లో డీజీఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించనున్నట్టు, తెలిపారు. బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి సత్తయ్య.పులి రాజిరెడ్డి, ఆకుల హరిణ్, మండ రమాకాంత్, సారంగపాణి , సాయవెని సతీష్ పాల్గొన్నారు.