రామగుండం విద్యాధికారి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. _DYFI
రామగుండం విద్యా వనరుల అధికారి (MEO) మరియు సిబ్బంది పైన వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని *భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ*) రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కమిటీ డిమాండ్ చేసింది.డివైఎఫ్ఐ జిల్లా *అధ్యక్షుడు కొంటు సాగర్* మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వనరుల కార్యాలయాల్లో పనిచేస్తున్న రామగుండంలో మాత్రం అధికారులు సిబ్బంది *12/11/2021 నాడు* కార్యాలయానికి తాళాలు వేసి …ఎక్కడికి వెళ్లారో సమాధానం చెప్పాలన్నారు. పారిశ్రామిక ప్రాంతంలో పాఠశాలలు కళాశాలల్లో అనేక సమస్యలతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వీటితోపాటు విద్యారంగ సమస్యలపై అధికారులను కలవడానికి వస్తే ఇక్కడ తాళాలు వేసి కార్యాలయం కనబడటం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు. ..సంబంధిత అధికారి ప్రభుత్వ పరంగా ఏవైనా కార్యక్రమాలు నిర్వహిస్తే కనీసం కిందిస్థాయి సిబ్బంది అయినా కార్యాలయంలో ఉండి జవాబుదారీ తనంగా ఉండాల్సింది పోయి వారు ఆడిందే ఆట పాడిందే పాట అన్న చందంగా వ్యవహరించడం వీరి పనితనానికి నిదర్శనమని వారు మండిపడ్డారు. రామగుండం మండల విద్యా వనరుల కార్యాలయ అధికారులు సిబ్బంది ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు కాబట్టే *నారాయణ లాంటి కార్పొరేటు విద్యా సంస్థలు* వారికి ఇష్టం వచ్చిన రీతిలో ప్రభుత్వ నిబంధనలను తుంగలోకి తొక్కి ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాబట్టి వెంటనే *డీఈఓ కలెక్టర్* …. ఈ సంఘటనపై స్పందించి స్థానిక *ఎంఈఓ అధికారులు, సిబ్బంది* పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.