సింగరేణి కార్మికులకు పండగే పండగ … 8న దసరా అడ్వాన్స్ 11న లాభాల వాటా నవంబర్ 1న దీపావళి బోనస్..
సింగరేణి సంస్థ ఈ ఏడాది ఆర్జించిన లాభాల్లో కార్మికులకు 29 శాతం వాటాను ఇవ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. సంస్థ ఆర్జించిన 272 కోట్ల లాభాలలో దాదాపుగా 80 కోట్లు వాటా చెల్లించనున్నారు. నిన్న జరిగిన సమావేశంలో గౌరవ కోల్బెల్ట్ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారు మరియు కోల్బెల్ట్ ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి ని కలవడం జరిగింది..
సింగరేణి కార్మికుల లాభాల వాటాను ముందుండి ఒక శాతం పెంచి కార్మికులకు ఇప్పించడంలో కృషిచేసిన టీబీజీకేఎస్ గౌరవధ్యక్షురాలు ..కల్వకుంట్ల కవితక్క ని బుదవారం టీబీజీకేఎస్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బి వెంకట్రావు గారు మిర్యాల రాజి రెడ్డి … మరియు మల్లయ్య గారు మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు …
అదేవిధంగా గా సింగరేణి కార్మికులకు దసరా అడ్వాన్స్ 25 వేల రూపాయలు 8న చెల్లించుటకు నిర్ణయించడం జరిగినది అదే విధముగా లాభాల వాటాను తేదీ 11న చెల్లించుటకు దసరా ముందుగా చెల్లించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగినది....కార్మిక అదేవిధంగా కార్మికులకు దీపావళి బోనస్ నవంబర్ 1న చెల్లించడానికి యాజమాన్యం ఒప్పుకోవడం జరిగింది.