దుమ్మురేపుతున్న ఏ ఆర్ రెహమాన్ సమకూర్చిన బతుకమ్మ పాట
పూలను కొలిచే సంప్రదాయం ప్రపంచంలో ఏ సంస్కృతిలో లేదు… అలాంటిది తెలంగాణ రాష్ట్రంలో పూలను పేర్చి ఆడటం ఓ మహా పండుగ…. అదే బతుకమ్మ… ఈ బతుకమ్మను పురస్కరించుకొని తెలంగాణ జాగృతి రూపొందించిన బతుకమ్మ పాట ‘అల్లిపూల వెన్నెల..’ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవమేనన్ విడుదల చేశారు. ఈ పాటకు ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించారు. మిట్టపల్లి సురేందర్ రాసిన ఈ గీతానికి గౌతమ్ మేనన్ దర్శకత్వం వహించడం విశేషం. “అందరు ఆడి పాడుకునే మట్టి మనుషుల పండుగ కోసం.. మా మనసులోని భావాలకి.. మా హృదయ స్వరాలని కూర్చి ఒక పాటగా పేర్చి బతుకమ్మ కానుకగా అందిస్తున్నాం” అని పేర్కొన్నారు.