పేరు మార్చుకున్న సమంత
…విడిపోతున్నట్లు ప్రకటించిన అనంతరం నెట్టింట్లో నాగచైతన్య, సమంత హాట్ టాపిక్గా మారారు. దీంతో, నెటిజన్ల చూపు వాళ్లిద్దరి సోషల్మీడియా ఖాతాలపైనే పడింది. ఈ క్రమంలోనే తాజాగా నటి సమంత తన పేరు మార్చుకున్నారు. తన అధికారిక ఇన్స్టాగ్రామ్, ట్విటర్ ఖాతాలకు ‘Samantha’ అని పేరు పెట్టుకున్నారు. అయితే, ఆమె ఫేస్బుక్ ఖాతా మాత్రం ‘Samantha Akkineni’ పేరుతోనే కొనసాగుతోంది. 2017లో నాగచైతన్యతో ఏడడుగులు వేసిన తర్వాత సామ్ తన సోషల్మీడియా ఖాతాలకు ‘Samanatha Akkineni’గా పేరు మార్చి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఈ క్రమంలోనే ఆమె జులై నెలాఖరులో ట్విటర్, ఇన్స్టాలకు ‘S’ అని మార్చి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.