రాంపల్లి శ్రీనివాస్ కు ఉపాధ్యాయ రత్న బిరుదు…
పెద్దపెల్లి జిల్లాలో సెప్టెంబర్ ఐదు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రకటించిన ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఆబాద్ రామగుండం పాఠశాల ఉత్తమ ఉత్తమ ఉపాధ్యాయుడుగా ఎన్నికైన సందర్భంగా ఆదివారం బాసర పట్టణంలో సుధాత్రి తెలంగాణ జాతీయ సాహిత్య సంస్కృతి సంస్థ వారు ఉపాధ్యాయ రత్న బిరుదు ప్రధాన చేయడంతో పాటు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సుధాకర్ తెలంగాణ జాతీయ సాహిత్య సంస్కృతి సంస్థ వ్యవస్థాపకులు అమరుకుల దృశ్యకవి, సెక్రటరీ స్వర్ణ సమత, ఎక్స్ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి, ఐపీఎస్ అధికారి ప్రకాష్ నారాయణ్, ప్రొఫెసర్లు కసిరెడ్డి వెంకటరెడ్డి, గూడ కృష్ణారెడ్డి, బండి పల్లి హరిత, రాంపల్లి దీప్తి, పాల్గొన్నారు. రాంపల్లి శ్రీనివాస్ కు ఉపాధ్యాయ రత్న బిరుదు వచ్చిన సందర్భంగా స్థానిక జడ్పిటిసి ఆముల నారాయణ, రామగుండం నియోజకవర్గం సింగిల్ విండో వైస్ చైర్మన్ ధరణి పోషం సంతోషాన్ని వ్యక్తం చేశారు.