మర్రిపల్లి మృతికి మెజీషియన్ల సంతాపం
గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కరీంనగర్ కు చెందిన ప్రముఖ ఇంద్రజాలికుడు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు మర్రిపల్లి శ్రీనివాస్ ఆదివారం తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. ఆయన గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మెజీషియన్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. గోదావరిఖనిలో నిర్వహించిన ఇంద్రజాలికుల దినోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రదర్శనలిచ్చారు. స్థానిక స్మైల్ ప్లీజ్ లాఫింగ్ క్లబ్ సభ్యులుగా ఉన్నారు. శ్రీనివాస్ మృతి పట్ల ఉమ్మడి కరీంనగర్ జిల్లా మెజీషియన్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు మేజిక్ రాజా, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మల్లేశం, యతిరాజ్, నాయకులు జక్కని రాజు, నరేన్, కెఎన్.చారి, కరీం, బండి శంకర్, మేజిక్ హరి, అలాడిన్, వంశీ, దీకొండ సత్యం, నాంపల్లి మల్లేశం, తోట గయాప్రసాద్, బాలె ఆనంద్, సిహెచ్ బాబు, జితేందర్, స్మైల్ ప్లీజ్ శ్రేణులు చంద్రపాల్, దామెర శంకర్ తదితరులు తమ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. మర్రిపల్లి మృతి ఇంద్రజాల రంగానికి తీరని లోటన్నారు.