అవయవ దానం పునర్జన్మనిస్తుంది..
అమ్మ జన్మనిస్తుందని, అవయవ దానం పునర్జన్మనిస్తుందని సదాశయ ఫౌండేషన్ సభ్యులు అన్నారు.. మంగళవారం పట్టణంలోని పోచమ్మ మైదానంలో ఏర్పాటు చేసిన స్వర్ణకార సంఘం మాజీ నాయకులు కొండపర్తి నరహరి జన్మదిన వేడుకల సందర్భంగా ఆయన నుంచి అవయవ దాన పత్రాలను స్వీకరించారు …
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…
అవగాహన కలిగిన వారు కుటుంబ సభ్యులను ఒప్పించి అవయవదానం చేస్తున్నారన్నారు. మిగతా 95 శాతం మంది అవయవ దానంపై సరైన అవగాహన లేకపోవడం వల్ల వారి అవయవాలు మట్టి పాలు, బూడిద పాలు, అవుతున్నాయన్నారు. అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా ప్రజల్లో అవగాహన పెరిగి అవయవాల లేమితో బాధపడుతున్న వారికి మళ్లీ పునర్జన్మ కలిగే అవకాశం ఉందని తెలిపారు…..
ఈ కార్యక్రమంలో రామగుండం స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శి కట్ట నగేష్ కుమార్, సభ్యులు రంగు శ్రీనివాస్, శ్రీరామోజు జగన్ ,గాలిపెల్లి రమేష్ ,కట్టా శ్రీధరచారి, కొండపర్తి సదానందం ,సిరికొండ సురేష్ బెజ్జంకి రాజేష్ తదితరులు పాల్గొన్నారు…..