ఆ గ్రామానికి అంతర్జాతీయ గుర్తింపు!
తెలంగాణలోని పోచంపల్లి గ్రామానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ జాబితాలో పోచంపల్లిని ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక చేసింది. ఈ మేరకు యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం సంస్థ ప్రకటించింది. డిసెంబర్ 2న స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో అవార్డుల ప్రధానం జరగనుంది. కాగా, పోచంపల్లి గ్రామానికి గుర్తింపుపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. గుర్తింపు రావడానికి కృషి చేసిన మంత్రిత్వశాఖ అధికారులను కిషన్ రెడ్డి ప్రశంసించారు