ఘనంగా సన్మానించి న కాలనీ వాసులు!

రామగుండం కార్పోరేషన్ 25వ డివిజన్ లోని బృందావనం కాలనీ వాసులు కార్పొరేటర్ నగునూరి సుమలత – రాజు ని ఘనంగా సన్మానించారు. ప్రజలు తనపై నమ్మకంతో గెలిపించిన నాటి నుండి ప్రజా శ్రేయస్సు, అభివృద్ధిపై దృష్టి పెట్టిందని కొనియాడారు. కాలనీలలో ఉన్న కనీస, మౌలిక సదుపాయాలు కల్పించడంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న కార్పొరేటర్ ను సత్కరించడం తమకు తాము సన్మానించడమే అన్నారు…ఎక్కడ ఎలాంటి సమస్య ఉన్నా కౌన్సిల్ ముందుకు తీసుకువెళ్లి సాధించే వరకు అపరభగీరథ ప్రయత్నం చేస్తుందని కాలనీప్రజలు పేర్కొన్నారు. ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకు వెళ్లి, పరిష్కారం అయ్యే వరకు పోరాడడమే కార్పొరేటర్ నైజంగా అలవాటు పరచుకోవడం గమనార్హం. ఈ ప్రాంతంలో ఇరవై ఏళ్ల నుంచి కనీసం రోడ్డు, విద్యుత్, వాటర్ పైప్ లైన్ లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో ప్రజల కష్టాలను గట్టెక్కించడంతో కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు… ఇదే క్రమంలో కార్పొరేటర్ కు అత్మీయ గౌరవం అందించామని కాలనీ ప్రజలు అంటున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాటతో పాటు డివిజన్ లో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం అభినందనీయమని డివిజన్ ప్రజలు పేర్కొంటున్నారు. ప్రతి ఇంటికి పెద్ద బిడ్డగా, ఆత్మీయంగా పలకరిస్తూ అందరిలో మమేకమై కలిసిపోయే తమ నాయకురాలును గౌరవించుకోవడం గర్వంగా ఉందని పలువురు ప్రస్తావించారు. అదేవిధంగా డివిజన్ ప్రజలందరి ఆధ్వర్యంలో నూతన పేరు బృందావనం కాలనీగా నామకరణం చేయడం జరిగింది ….

ఈ కార్యక్రమంలో, మిట్టపెల్లి మహేందర్, ఈసంపల్లి వెంకన్న, మాదాసి రాజయ్య, మొలుగూరి రాజేందర్, తోట కొమురయ్య, నరెడ్ల సదానందం,పి శంకర్ భగవాన్ రెడ్డి, రాజ లింగు, కొమురయ్య, లక్ష్మీనారాయణ, రామిళ్ళ రాజలింగం, సారయ్య, తోట ప్రవీణ్ ,సుభద్ర, ఇంద్ర, కమల, రమా, బుజ్జి, సాయి, తదితరులు కాలనీవాసులు పాల్గొన్నారు…….

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *