బిపిన్ రావత్ కన్నుమూత!

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ కన్నుమూశారు. ఆయన ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదవశాత్తూ తమిళనాడులో కుప్పకూలింది. కోయంబత్తూర్, కూనూరు మధ్యలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హెలికాప్టర్లో బిపిన్ రావతో పాటు, ఆయన సతీమణి మధులిక రావత్, ఆర్మీ ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. వెల్లింగ్టన్లోని డిఫెన్స్ కాలేజీలో లెక్చర్ ఇచ్చేందుకు ఈ ఉదయం రావత్ దంపతులు, ఆర్మీ అధికారులతో కలిసి ఈ ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి తమిళనాడు వెళ్లారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో సూలూరు ఎయిర్బేస్ నుంచి ఆర్మీ హెలికాప్టర్లో వెల్లింగ్టన్ వెళ్తుండగా ప్రమాదవశాత్తూ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో రావత్ సహా హెలికాప్టర్లో ఉన్నవారంతా మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *