శోభనాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిన యువకుడు.!
దర్వాజ: కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలో ఘటన. ఫిబ్రవరి 8న బాలికతో యువకుడి వివాహం. ఆ తర్వాత జరిగిన తొలిరేయి దృశ్యాలను సోషల్ మీడియాకెక్కించేసి కలకలం రేపిన వైనం?. బాలిక తల్లి ఫిర్యాదుతో అరెస్ట్సోషల్ మీడియా వచ్చాక కొందరి పిచ్చి వెర్రితలలు వేస్తోంది. పదిమందికీ చేరువవ్వాలన్న ఆరాటం కొందరితో పిచ్చి పనులు చేయిస్తోంది. విచక్షణ కోల్పోయి రహస్యాలను కూడా బయటపెట్టేసుకుని కష్టాలను కొనితెచ్చుకుంటున్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలోని ఓ గ్రామంలో ఇలాగే జరిగింది. గత నెల 8న గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలికకు 20 ఏళ్ల యువకుడితో వివాహం జరిగింది. ఆ తర్వాత జరిగిన తొలిరేయి దృశ్యాలను వీడియో తీసి వాటిని అతడు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు. అంతే.. ఒక్కసారిగా కలకలం రేగింది.విషయం తెలిసిన బాలిక తల్లి గత నెల 20న పోలీసులకు ఫిర్యాదు చేసింది. 28న అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈ విషయాన్ని కాట్రేనికోన పోలీసులు నిన్న వెల్లడించారు……..