ప్లాస్టిక్ వస్తువులు వాడితే చర్యలు తప్పవు!
నిషేదిత ప్లాస్టిక్ తయారీ వస్తువులను ఉపయోగించే టిఫిన్ సెంటర్ లు , హోటళ్లు , ఫంక్షన్ హాల్ లకు నోటీసులు జారీ చేయాలని సానిటరీ ఇన్స్పెక్టర్ లకు రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ బి. సుమన్ రావు ఆదేశాలు జారీ చేశారు. రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో ఆదివారం సానిటరీ ఇన్స్పెక్టర్ లతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ నిషేదిత ప్లాస్టిక్ వినియోగించరాదని గతంలోనూ నోటీసులు జారీ చేసినప్పటికీ వాటి వాడకం యధేచ్చగా కొనసాగుతున్నదని ఆరోపణలు వస్తున్న నేపధ్యంలో ఇక నుండి కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. నిషేదిత ప్లాస్టిక్ తో తయారు చేసిన చేతి సంచులు , సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు ఎక్కడ కనబడినా సీజ్ చేయడంతో పాటు వాడకం దారులకు జరిమానా విధించాలని ఆదేశించారు. ప్రజలు కూడా నిషేదిత ప్లాస్టిక్ తో జరిగే హాని గుర్తుంచుకొని బజారుకు వెళ్లేటప్పుడు తమ వెంట వస్త్ర సంచులు , టిఫిన్ బాక్సులు తీసుకెళ్లాలని సూచించారు.
ఈ సమావేశంలో ఆర్ ఓ మనోహర్ , సానిటరీ ఇన్స్పెక్టర్ లు శ్యామ్ , నాగ భూషణం , సునీల్ , , సీనియర్ అసిస్టెంట్ పబ్బల శ్రీనివాస్ , సూపర్ వైజర్లు బండా రి రవి ,ఉమా మహేశ్వర్, సుగుణాకర్ రెడ్డి అశోక్ , శ్రీనివాస్ , తిరుపతి , దయానంద్ , సారయ్య , యూసఫ్ , సోమేష్ , రాజబాబు , శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.