ప్రజలను మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం !
బిజెపి అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అసలు పొంతన లేకుండా ఉందని, తెలంగాణ ప్రజలను రాష్ట్ర ప్రభు త్వం మరోసారి మోసం చేసిందని బిజెపి అధికార ప్రతినిధి పో రెడ్డి కిషోర్ రెడ్డి ఆరోపించారు. రామగుండం నియోజకవర్గం లోని శారదనగర్ సరస్వతి శిశుమందిర్ అవరణలో ఆదివారం ప్రముఖ విద్యావేత్త, న్యాయవాది, అనలిస్ట్ పోరెడ్డి కిషోర్ రెడ్డిచే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ పై అవగాహనా సదస్సు, చర్చా గోష్టి కార్యక్రమం రామగుండం నియోజకవర్గ మేధావులతో ఏ ర్పాటు చేశారు. రామగుండం మాజీ ఎమ్మెల్యే మాజీ ఆర్టీసీ చై ర్మన్ సోమారపు సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్ర మంలో ముఖ్య అతిథిగా తెలంగాణ బిజెపి అధికార ప్రతినిధిపో రెడ్డి కిషోర్ రెడ్డి హాజరై మాట్లాడారు. అనతికాలంలో భారతదే “కాన్ని ప్రపంచ దేశాలతో పోటీగా ఎక్కడ నిలబెడుతుందో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి మేధావులకు, న్యాయ వాదులకు, నాయకులకు, కార్యకర్తలకు బడ్జెట్ విశ్లేషణ ద్వార వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఎన్నికల దృష్ట్యా ప్రజలను మోసం చేసేలా రాష్ట్ర బడ్జెట్ ఉందన్నారు.
ఈకార్యక్ర మంలో వడ్డేపల్లి రామచంద్రం, సత్యం, బిజెపి రాష్ట్ర నాయకు లు సోమారపులావణ్య అరుణ్ కుమార్, కార్పొరేటర్ దుబ్బాసి లలిత మల్లేష్, కార్పొరేషన్ అధ్యక్షుడు లక్ష్మణ్, కుసుమ, సూర్య దేవర జ్యోతి, మండల అధ్యక్షులు నారాయణరెడ్డి, డేవిడ్, మిట్ట పల్లి సతీష్, జనార్దన్, భరత్, సునీల్, మేధావులు, న్యాయవాదు లు, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు…