11వ డివిజన్ కార్పొరేటర్ పెద్దెల్లి తేజస్వి ప్రకాష్ గార్ల కుమారుడు వర్షిత్ జన్మదిన వేడుకలు

స్థానిక విట్టల్ గోదావరిఖని అమ్మ పరివార్ అనాధాశ్రమంలో 11వ డివిజన్ కార్పొరేటర్ పెద్దల్లి తేజస్వి ప్రకాష్ గారి కుమారుడు “చిన్నారి పెద్దెల్లి వర్షిత్” జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా చిన్నారుల మధ్య కేకును కట్ చేసి, ఆశ్రమంలో నివసించే చిన్నారులకు మరియు వృద్ధులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా అమ్మ పరివార్ ఆశ్రమం నిర్వాహకులు ఎన్నో కష్టాలను ఒడిదుడుకులను ఓర్చుకొని నిస్వార్థ సేవ తో పిల్లలకు మరియు వృద్ధులకు తమ సేవలను అందిస్తూ పారిశ్రామిక ప్రాంతంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు అని అన్నారు. అదే విధంగా తమ వంతు సహాయ కార్యక్రమాలు ఎల్లప్పుడూ అమ్మ పరివార్ ఆశ్రమం లోనే జరుగుతాయని హామీ ఇచ్చారు. కార్యక్రమం నిర్వహించిన పెద్దల్లి తేజస్వి- ప్రకాష్ గార్ల దంపతులకు ఆశ్రమ నిర్వాహకులు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో, పెద్దేల్లి మధునమ్మ, సలిగంటి అచ్యుత్, కొండ్రా నరేష్ కుటుంబ సభ్యులు, మిత్రులు ఆశ్రమ నిర్వాహకులు మంద నాగరాజు సిబ్బంది మరియు ఆశ్రమ పిల్లలు పాల్గొన్నారు.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *