హావ్వ ….!పద్నాలుగేళ్ల కుర్రాడిని ఆవిడ ఏం చేసింది?

చండీగఢ్‌కు చెందిన తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో స్థానికంగా ఉన్న ఓ ట్యూషన్ సెంటర్‌లో చేర్పించారు. చేర్పించిన కొద్ది రోజులకే మీ పాప బాగా అల్లరి చేస్తోంది. మిగితా విద్యార్థులకు ఇబ్బందిగా ఉంది ఆమెను వేరే ట్యూషన్ సెంగటర్ పంపించండి అని చెప్పడంతో ఆ దంపతులు కంగుతిన్నారు. ఆ మరుసటి రోజు నుంచి తమ 14ఏళ్ల కుమారుడిని మాత్రమే ట్యూషన్‌కు పంపించారు. అయితే తాజాగా ఆ అబ్బాయి కూడా టీచర్ దగ్గరకు ట్యూషన్‌కు వెళ్లనని మారం చేయడం ప్రారంభించాడు. దీంతో అసలు సమస్య ఏంటని ఆ తల్లిదండ్రులు ఆరా తీశారు. ఈ క్రమంలో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. 34ఏళ్ల టీచర్.. తమ 14 ఏళ్ల బాబుపై లైగింక దాడి చేస్తున్నట్లు తెలుసుకుని నివ్వెరపోయారు. బాబు అనుభవించిన బాధను ఊహించుకుని ఆవేదన చెందారు. ఈ విషయాన్ని తేలికగా తీసుకోకుండా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెను పోలీసులు అరెస్టు చేసి, జైలుకు తరలించారు. ఈ ఘటన 2018లో చోటు చేసుకోగా.. దీనిపై విచారణ జరిపిన కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. ఆ మహిళా ట్యూటర్‌కు కోర్టు 10ఏళ్ల జైలు శిక్షతోపాటు, 10వేల జరిమానా విధించింది

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *