తెలంగాణలో వై ఎస్ ఆర్ టి పి జెండా ఎగరవేసేన?ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో జత కట్టిన పార్టీ

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్ఆర్‌టీపీతో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీమ్ జతకట్టింది. లోటస్ పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో వైఎస్ షర్మిలతో ప్రశాంత్ కిషోర్ టీమ్ సమావేశమైంది. ఈ భేటీలో పార్టీ విస్తరణ, భవిష్యత్ కార్యాచరణ, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడం, క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయడం, పాదయాత్ర తదితర అంశాలపై చర్చిస్తున్నారు.ప్రశాంత్ కిషోర్ టీమ్ సేవలు తీసుకోనున్నట్టు ఇటీవలే షర్మిల ఓ టీవీ కార్యక్రమంలో స్పష్టం చేశారు. ఆమె చెప్పిన రోజుల వ్యవధిలోనే పీకే టీమ్ రంగంలోకి దిగింది. రాబోయే ఎన్నికల సమయానికల్లా పార్టీని ఇతర ప్రధాన పార్టీలకు దీటుగా తయారు చేయడమే లక్ష్యంగా పీకే టీమ్ పని చేయనుంది. పార్టీకి సంబంధించిన ప్రచార కార్యక్రమాలను నిర్వహించనుంది

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *