గ్రాండ్ క్రిస్మస్ ను ఘనంగా జరుపుకుందాం–రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్.

క్రిస్మస్ పండుగను అత్యంత ఘనంగా, వైభవంగా నిర్వహించాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చర్చిల పాస్టర్లకు సూచించారు. గోదావరిఖని గాంధీనగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాస్టర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిసెంబర్ లో ఏసుక్రీస్తు జన్మదినమైన క్రిస్టమస్ ను పెద్ద పండుగ వాతావరణంలో నిర్వహించాలని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ అన్ని మతాలకు, అన్ని కులాలకు సమ ప్రాధాన్యత కల్పిస్తున్నారని, అందులో భాగంగానే హిందువుల బతుకమ్మ పండుగకు, ముస్లింల రంజాన్ కు, క్రైస్తవుల క్రిస్టమస్ కు ప్రత్యేక నిధులు కేటాయిస్తూ, అన్ని మతాలకు, అన్ని కులాలకు సమాజంలో తగిన గౌరవం పెంపొందేలా చేస్తున్నారని అన్నారు. క్రిస్టమస్ సందర్భంగా అన్ని చర్చిలను రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించాలని, సింగరేణి స్టేడియంలోగాని, ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలోగానీ సువార్త కూటములు, గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించాలని, అందుకోసం మున్సిపల్ కార్పోరేషన్ నుండి అవసరమైన నిధులు, సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. ఇంకా ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, కార్పొరేటర్ బాల రాజ్ కుమార్, టీఆరెస్ నాయకులు పాతిపెల్లి ఎల్లయ్య, మెతుకు దేవరాజ్, “ఇంటర్ డినామినేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్” జిల్లా అధ్యక్షులు బిషప్ ఈర్ల జాన్ సుందర్, జాయింట్ సెక్రటరీ పాస్టర్ AP.నెల్సన్, ట్రెజరర్ పాస్టర్ యం.మహిపాల్ రెడ్డి, ఎక్జిక్యూటివ్ మెంబర్స్ పాస్టర్లు ఇశ్రాయేల్, అభిషేక్ పాల్, గాబ్రయేల్ మరియు అన్ని చర్చి ల పాస్టర్లు పాల్గొన్నారు.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *