ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా

హుజూరాబాద్ ఎన్నికల సందర్భంగా తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి సూచనల మేరకు ఈనెల 29, 30వ తేదీల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరుగనున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి టి. రాజ్యలక్ష్మీ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 29న జరగాల్సిన పరీక్షలను ఈనెల 31న (ఆదివారం), ఈ నెల 30న జరగాల్సిన పరీక్షలను నంబర్ 1న (సోమవారం) నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. సూచనలను విద్యార్థులు పాటించాలని సూచించారు.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *