రాహుల్ గాంధీ సభను విజయవంతం చేయండి.

వేలాదిగా తరలి రండి. మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, పెద్దపల్లి పార్లమెంట్ ఇంచార్జ్ మోహన్ జోషి, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మక్కాన్ సింగ్.

దర్వాజ,పెద్దపల్లి: ఈనెల 29న పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరగనున్న రాహుల్ గాంధీ మహాసభకు వేలాదిగా తరలిరావాలని కాంగ్రెస్ నాయకులు పిలుపునిచ్చారు.జిల్లా కేంద్రం లోని ఆర్కే గార్డెన్స్ లో …విజయరమణ రావు ఆధ్వర్యంలో మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, పెద్దపల్లి పార్లమెంట్ ఇంచార్జ్ మోహన్ జోషి, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మక్కాన్ సింగ్ తో నిర్వహించిన విలేకరుల సమావేశంలో శ్రీధర్ బాబు మాట్లాడుతూ….గురువారం రోజున ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పెద్దపల్లి నియోజకవర్గనికి వస్తున్న సందర్భంగా పెద్దపల్లి పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సాయంత్రం నాలుగు గంటలకు బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందన్నారు. కావున పెద్దపల్లి జిల్లా రామగుండం, మంథని, పెద్దపల్లి నియోజకవర్గల నుండి అధిక స్థాయిలో ప్రజలు తరలి రావాలని, బహిరంగ సభను విజయవంతం చేయాలనీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు దిశ నిర్దేశం చేశారు.అనంతరం వారు సభ ప్రాంగణాన్ని పరిశీలించారు. అలాగే పెద్దపల్లి నియోజకవర్గం తో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.

ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు,ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, యువకులు , తదితరులు పాల్గొన్నారు

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *