అకాల మరణానికి గురైన విద్యార్థి కుటుంబానికి ఆర్థిక సహాయం.
గవర్నమెంట్ సిటీ కాలేజి, హైదరాబాదులో డిగ్రీ ద్వితీయ సం. చదువుతున్న ప్రణయ్, ఈ నెల 4వ తేదీ తెల్లవారుఝామున జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, 6వ తేదీ మరణించాడు. గోదావరిఖనిలో పేద కుటుంబానికి చెందిన రమేష్, రమ్య దంపతుల కుమారుడైన ప్రణయ్చదువుకుంటూనే చిరు సంపాదనతో తల్లిదండ్రులకు తోడ్పడుతున్నాడు. అలాంటి సమయంలో తీవ్రంగా గాయపడి మరణించిన విద్యార్థి కోసం కాలేజి ప్రిన్సిపాల్, అధ్యాపకులు, స్నేహితులు అందించదలచిన రూ.1,00,000/- (లక్ష రూపాయలు) ఆర్థిక సహాయాన్ని నవంబరు 15వ తేదీ అతని కుటుంబానికి అందించారు. కాలేజి తరఫున ప్రణయ్ స్నేహితుడు, ద్వితీయ సం. విద్యార్థి వెంకీ వర్మ ద్వారా విద్యార్థి తల్లిదండ్రులకు ఈ సహాయాన్ని అందజేశారు కళాశాల వారు. విద్యార్థి మరణం చాలా బాధ కలిగించిందని, విద్యార్థులు వాహనాలు నడుపుతున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ డా.పి.బాల భాస్కర్ అన్నారు.