రానున్న రెండు మూడు నెలల్లో 70 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్!
కరోనా సమయంలో ప్రైవేట్ టీచర్లను ఆదుకున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ మంగళవారం అసెంబ్లీలో స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 1, 51,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చాము. 1,31,000 ఉద్యోగాలు ఇచ్చాము. త్వరలోనే ఉద్యోగాలు పొందిన వారి లిస్ట్ అసెంబ్లీకి ఇస్తాం. రాబోయే రెండు మూడు నెలల్లో నోటిఫికేషన్లు స్టార్ట్ అవుతాయి. నాకున్న అంచనా మేరకు 70వేల వరకు ఉద్యోగాలు రాబోతున్నాయి. రాష్ట్రంలో ఎన్ని దళిత కుటుంబాలు ఉంటే అన్ని కుటుంబాలకు దళితబంధు వర్తింపచేస్తాం’’ అన్నారు కేసీఆర్.