గెల్లు కు బి ఫారం
హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి ఉన్న గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు టిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ బీ-ఫారం అందించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందన్నారు. బీ-ఫారంతో వెళ్లి భారీ మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యేగా హైదరాబాద్ వస్తావంటూ శ్రీనివాస్ యాదవ్‌ను కేసీఆర్ ఆశీర్వదించారు. హుజూరాబాద్ టీఆర్ఎస్కు కంచుకోట అని, అక్కడ వ్యక్తులుగా కాకుండా పార్టీ ఎదిగిందని చెప్పారు. పార్టీకి ద్రోహం చేసిన వారికి అక్కడ చోటు లేదన్న కేసీఆర్… హైదరాబాద్ లో టిఆర్ఎస్ ది గెలుపని సర్వేలన్నీ చెబుతున్నాయని తెలిపారు. ఎన్నికల ప్రచార సభలో తాను కూడా పాల్గొంటానని కేసీఆర్ స్పష్టం చేశారు