పేకాట స్థావరం పై టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆకస్మిక దాడి. ….. 7 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్.. _1,41,480 వేల రూపాయల నగదు, _07 సెల్ ఫోన్స్, _03 వాహనాలు స్వాధీనం….

రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ అందిన సమాచారం మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి జిల్లా గొదవరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గురువారం రాత్రి లక్ష్మి నగర్ ప్రాంతం లోని ఒక ఇంట్లో డబ్బులు పందెంగా పెట్టుకుని పేకాట ఆడుతున్నారు నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ సీఐ రాజ్ కుమార్ పర్యవేక్షణ లో టాస్క్ ఫోర్స్, గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు, సహకారం తో టాస్క్ ఫోర్స్ ఎస్ఐ మస్తాన్ తమ సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీ నిర్వహించి అక్కడే ఉన్న ఏడుగురు అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 1,41,480 రూపాయల నగదు, పేకాట ముక్కలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకున్న వీరిని తదుపరి విచారణను గోదావరిఖని పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది.పట్టుబడిన వారి వివరాలు . శ్రీరామోజీ జగన్ తండ్రి సీతావనం,46సం, మారుతీ నగర్, గోదావరిఖని ఇంటి ఓనర్, ఉట్ల శ్రీనివాస్ రెడ్డి తండ్రి మోహన్ రెడ్డి,42సం, గంగ నగర్, గోదావరిఖని.ఎం ఎస్ ఖాన్ తండ్రి అఖీమ్,45సం,, మెహబూబ్ బస్తి రామగుండం గూండా రమేష్ తండ్రి పోచయ్య, 41సం, పద్మశాలి, మారుతి నగర్ గోదావరిఖని , బొడ్ల ఆంజనేయులు తండ్రి కైలాశం,57 సం, మార్కండేయ కాలనీ, ఆరెల్లి శ్రీనివాస్ తండ్రి రాములు,45 సం, లక్ష్మీ నగర్ గోదావరిఖని పత్తి తిరుపతి తండ్రి కిష్టయ్య,50సం, పవర్ హౌస్ కాలనీ గోదావరిఖని. ఈ ప్రాంతాలకు చెందిన వారు గా పోలీసులు తెలిపారుఈ సందర్భంగా సీపీ మాట్లాడారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు అనే అత్యాశకు పోయి చాలా మంది పేకాట బానిసలుగా మారుతున్నారు అని అప్పుల పాలవుతున్న కుటుంబలను రోడ్డుపాలు చేస్తున్నారన్నారు. పేకాట ఆడుతూ పట్టుబడిన వారు వారి ప్రవర్తన మార్చుకో నట్లయితే వారిపై పీడీ యాక్ట్ అమలు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.ఈ టాస్క్ లో గోదావరిఖని 1టౌన్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు, టాస్క్ ఫోర్స్ ఎస్ఐ షేక్ మస్తాన్, ఎస్ఐ రమేష్, టాస్క్ ఫోర్స్ సిబ్బంది శ్రీనివాస్, మహేందర్, ప్రకాష్, మల్లేష్, టౌన్ సిబ్బంది నరేందర్ పాల్గొన్నారు.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *