గంజాయి పై పోలీస్ దాడులు, సరఫరా చేసే నిందితుడు అరెస్ట్, 1కిలో గంజాయి స్వాధీనం…

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిరంతరం గంజాయి పై పోలీసులదాడులునిర్వహిస్తున్నారు.బుధవారం గోదావరి ఖని రాంనగర్ రైల్వే పట్టాలు అవరణంలో దేవోజీ వేణు అనే యువకుడు గంజాయి అమ్మడానికి రాగ పక్క సమాచారం మేరకు 1టౌన్ ఎస్ఐ ఉమాసాగర్ తన సిబ్బందితో వెళ్లి పట్టుకోవడం జరిగింది అతని దగ్గర నుండి 1కిలొ గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది.అనంతరం గురువారం గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో గోదావరిఖని ఏసిపి గిరిప్రసాద్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిందితుడి అరెస్ట్ వివరాలు వెల్లడించడం జరిగింది.నిందితుడు దేవోజి వేణు,అనే యువకున్నీ నమ్మదగిన సమాచారం మేరకు ఈ నెల 27న, గోదావరిఖని రాంనగర్ రైల్వే పట్టాల వద్ద గంజాయి అమ్ముకోవడం కోసం అక్కడ ఉండగా ఎస్సై ఉమాసాగర్ తన సిబ్బందితో వెళ్లి పట్టుకోవడం జరిగింది అతన్ని తనిఖీ చేయగా అతని వద్ద 1కిలో గంజాయి దొరికినది అని ఎసిపి తెలిపారు. ఎస్ఐ సీఐ రమేష్ కు తెలిపగా రామగుండం ఎమ్మార్వో రమేష్ సమాచారం సిఐ అందించగా ఎమ్మార్వో అందుబాటులో లేనందున డిప్యూటీ ఎమ్మార్వో బత్తిని కిరణ్ ను పంపించడం జరిగింది. డిప్యూటీ ఎమ్మార్వో కిరణ్ ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించి అనంతరం అతన్ని స్టేషన్ కు తరలించి కేసు నమోదు జరిగింది. నిందితున్ని పట్టుకున్న సిఐలు జి రమేష్ బాబు , ఎస్ రాజ కుమార్ గౌడ్ , ఎస్సై ఉమాసాగర్, ఏ ఎస్సై మల్లయ్య, కానిస్టేబుల్స్ హేమసుందర్, తీట్ల శ్రీనివాస్, గోపతి వెంకటేష్ , హోం గార్డ్ శేఖర్ లను ఏసిపి అభినందించారు.యువత ఎక్కువగా గంజాయికి బానిస అయి ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటూ, నేరాలకు పాల్పడుతున్నారు అని, తల్లిదండ్రులు తమ తమ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి వారి కదలికలను వారి ప్రవర్తనను నిశితంగా గమనించగలరు అన్నారు . వారు ఎవరితో స్నేహం చేస్తూ ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారో వారందరి పట్ల ప్రత్యేక దృష్టి పెట్టాలి. గంజాయి గురించి ఎలాంటి సమాచారం ఉన్న డయల్ 100 కి గాని, నేరుగా మాకు గాని సమాచారం ఇచ్చి యువతను చెడు మార్గం వైపు వెళ్లకుండా మాకు సహకరించగలరు అని తల్లిదండ్రులకు ,ప్రజలకు సూచించారు.ఎవరైన గంజాయి పై సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలు అత్యంత గోప్యంగా ఉంచబడును అని తెలిపారు. గంజాయి అమ్మిన లేదా కొన్న లేదా సేవించిన వారి పై చట్టరీత్య కఠినచర్యలు తీసుకునబడుతాయి ఏసీపీ హెచ్చరించారు.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *